• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kakinada Sangeetha Sourabham

Kakinada Sangeetha Sourabham By Aakondi Srinivasa Rajarao

₹ 300

గ్రంథకర్త తొలి పలుకులు

విశాఖకు చెందిన సంగీత విదుషి శ్రీమతి సోమయాజుల సుబ్బలక్ష్మి విశాఖపట్నానికి సంబంధించిన సంగీత విశేషాల గురించి పరిశోధన చేస్తున్నారు అనే విషయం నాకు 2022 లో తెలిసింది. సంగీత రంగంలో విశాఖ కన్నా కాకినాడకు ఇంకా ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. సంగీతానికి సంబంధించిన ఎన్నెన్నో నూతన అంశాలు కాకినాడలో రూపుదిద్దుకొన్నాయి. ఎన్నో విషయాలలో కాకినాడ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది. కాకినాడలోని ప్రాచీనమైన సంగీత సభలు, తెలుగు రాష్ట్రాలకు సంగీత సభల ఆవశ్యకతను చాటిచెప్పాయి. ఎందరో వాగ్గేయకారులు, గ్రంథకర్తలు, సంగీత విద్వాంసులు, విదుషీమణులు ఇక్కడ ప్రభవించారు. ఇలా కాకినాడ విశేషాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ విశేషాలన్నింటినీ ఒక గ్రంథంగా రూపొందించాలనే ఆలోచన 2022 లోనే నాకు కలిగింది. అప్పటినుంచీ పరిశోధన, రచన సాగించగా, ఇదిగో ఇప్పటికి ఈ గ్రంథం మీ చేతులలోకి వచ్చింది.

గ్రంథరచన చేయడం ఒక ఎత్తు అయతే దానిని ప్రచురించడం మరొక ఎత్తు. ప్రచురణ కోసం సంగీత విదుషి కనుమూరి రాజ్యలక్ష్మిగారు కొంత ధన సహాయాన్ని అందించారు. వారికి నా కృతజ్ఞతలు. 'ఈ చరిత్ర ఇప్పటి తరం వారికి, భవిష్యత్తు తరాలవారికి తెలియడం ఎంతో అవసరం. ప్రచురణ బాధ్యత నాపై ఉంచండి' అంటూ, నాపైన ఎంతో ఆదరణతో ప్రచురణకు కావలసిన ఆర్థిక సహాయాన్ని 'తూర్పుగోదావరి జిల్లా సంఘం' నుంచి నాకు అందేలా చేసారు శ్రీ కె.వి.యస్. ఆంజనేయమూర్తిగారు. అంతేకాదు. పుస్తకాన్ని చదివి వారి విలువైన అభిప్రాయాన్ని అందించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాను.

ఇంకా ఈ గ్రంథం మీ ముందుకు రావడానికి 'గానకళ' సంపాదకులు...................

  • Title :Kakinada Sangeetha Sourabham
  • Author :Aakondi Srinivasa Rajarao
  • Publisher :Meher Prachuranalu
  • ISBN :MANIMN6307
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :311
  • Language :Telugu
  • Availability :instock