Logili Books

Novels

Kanne Naagu

By Lalladevi

₹225
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kanne Naagu
Author
Publisher
Classic Books
ISBN
MANIMN7185
Binding
Paparback
Published Date
Sep, 2026
Number Of Pages
221
Language
Telugu
Availability
In Stock
About this book

కన్నెనాగు

గదిలో అగరొత్తులు వెలుగుతున్నాయి. సంధ్యా సమయంలో తెంచిన మల్లె మొగ్గలు విచ్చుకునే వేళ అయింది. దీపకాంతుల వల్ల గది పకాలున నవ్వుతున్న పడుచులా చూడబుద్ధి అవుతోంది. మనోరంజకమయిన శాండల్ వుడ్ పరిమళం మెత్తగా గది

నాలుగు మూలలా పరుచుకొంటోంది.

ఓరగా తెరచి ఉంచిన వాకిలి అవతల మెత్తని అడుగుల సవ్వడి కోసం ఎదురు చూస్తున్నాడు ఓ యువకుడు. అతడి పెదవుల మీద చిరునవ్వు. కన్నుల్లో కోరికలు. గుండె చప్పుడులో గుసగుసలు. మనసంతా తీయ తీయని ఆలోచనలు!

మల్లెల తెల్లదనాన్ని తలదన్నేలా ఉన్న ధోవతి కట్టుకున్నాడు. పసిపాప మనసులా స్వచ్చమయిన చోళీ వేసుకున్నాడు. నుదురు మధ్యలో ఆవగింజంత ఎర్రని తిలకం చుక్క దిద్దుకున్నాడు. బుగ్గమీద కాటుక చుక్క వల్ల పెళ్ళి కళ ఉట్టిపడుతోంది. అతడు ఆశించిన విధంగానే కొద్దిసేపటి తరువాత వరండాలో మెత్తని అడుగుల సవ్వడి అయింది.

గాజులు ఘలఘలమన్నాయి. వెండి పట్టాల దానిమ్మ గుత్తులు చిన్న చిన్న మువ్వల్లా ముచ్చటయిన శబ్దం చేస్తున్నాయి.

'అదిగో వస్తోంది. వచ్చేస్తోంది' అనుకున్నాడు. మనసంతా ఏదో తెలియని ఉత్సాహం నిండింది. ఎన్నడూ తన అనుభవంలోకి రాని తొట్రుపాటు కలుగుతోంది. మనసులోకి చిలిపి చిలిపి ఆలోచనలు వస్తున్నాయి.

ఇది తొలి రాత్రి. రెండు శరీరాలను, మనసులను ఆత్మలను అనుసంధానం చేసి, అనుభవాలెన్నింటినో పంచి యిచ్చే మధుర యామిని, బ్రతుకులో ఒక్కసారి మాత్రమే పొడిచే పున్నమి! అందాలరాసి ఆమె వచ్చేస్తోంది. ఆమె కాదు అర్ధాంగి!

అతడికి మంచం మీద కూర్చో బుద్ధి అవలేదు. చివాలున లేచి బిరబిరా వచ్చి తలుపు చాటున దాగాడు. ఆమె తలవొంచుకుని గదిలో అడుగు పెడుతుంది. లోపలకు వచ్చేందుకు సంశయిస్తుంది. తాను వెనుకగా వెళ్ళి కళ్ళుమూస్తాడు. ఆమె సిగ్గుపడుతుంది. ఆనందంగా నవ్వుతుంది..........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?