రైటింగ్లో ఆ కిక్కే వేరప్పా!
జీవితాన్ని అన్ని కోణాల నుంచి నిండుగా అనుభవించగలిగేది ఒక్క రచయిత మాత్రమే. మిగిలిన వారు కేవలం బతుకుతారు తప్ప జీవించరు. రచయిత తాను నిండుగా జీవించడమే కాకుండా పాఠకులను కూడా జీవింపచేస్తాడు. అందుకే సమాజమనే దేహానికి రచయితలు రక్తనాళాలు.
- శ్రీరామ్ (ఆధ్యాత్మిక గురువు)
పాఠకుల సంఖ్య తగ్గుతున్నా ఇప్పటికీ రచయితకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఒకసారి రచయిత అయితే ఇక ఆ స్థానం చెక్కు చెదరదు.
మన దేశ పూర్వ ప్రధాని ఎ. బి.వాజ్పేయి ఒకానొక సందర్భంలో చెప్పిన మాట అక్షర సత్యం : నేను మాజీ ప్రధానిని కావచ్చేమో, కానీ ఎన్నటికీ మాజీ కవిని మాత్రం కాబోను.
సంఘర్షణలకు పరిష్కార వేదిక :-
ఆలోచనలనైనా, అంతఃసంఘర్షణలనైనా, మనసులో కదలాడే భావాలనైనా కాగితంపై పెట్టడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలెన్నో ఉన్నాయని మనస్తత్వ నిపుణులు పరిశోధించి నిగ్గు తేల్చారు........................