• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Malli Eppudostavakka? ? ? ? ? ?

Malli Eppudostavakka? ? ? ? ? ? By Chandu Subbarao

₹ 120

ఎవరి కోసం?
 

పది సంవత్సరాల క్రితమనుకుంటాను.

కృష్ణానందం సమితి ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడన్న వార్త ప్రజలు యావన్మందినీ ఆనందపరిచింది. ఓడిపోయిన పార్టీ మనుషులు కూడా లోలోన సంతోషపడ్డారు. సరయిన వ్యక్తి గెలిచాడు. ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నారు.

గత ముప్పయ్యేళ్ళుగా 'ప్రజాహిత' పార్టీకి అధికారం రాలేదు. దానికి నాయకుడైన కృష్ణానందం అహర్నిశలూ అందరి సమస్యలూ నెత్తిన వేసుకుని తిరుగుతుండేవాడు. జైళ్ళు, లాఠీలు తప్ప కుర్చీలు ఫలకాలు ఆయన్నెప్పుడూ పలకరించలేదు. ఖాకీ దుస్తుల వారి పరామర్శలే తప్ప. తెల్ల బట్టలు అధికారుల గౌరవం ఎప్పుడూ పొందలేదు. ఇదిగో యీనాటికి....ఎంత చిన్నదయినా.... కృష్ణానందం గార్కి పదవి లభించిందనేసరికి పేదా బిక్కీ పరమానందభరితులయ్యారు.

"మా నాయకుడూ జీపులో వెళతాడు. ఆఫీసు దగ్గర బంట్రోతు వెధవ యిన్నాళ్ళకు కోతిలా ఎగిరి దూకి కారు తలుపు తీస్తాడు. క్లర్కులూ, సూపరింటెండెంట్లు ఆఫీసులోకి కృష్ణగారు వెళ్ళగానే లేచి నిలబడతారు. ఎన్ని సంవత్సరాలుగానో ప్రజల సమస్యల మీద లోనికిపోతే కృష్ణగార్ని చులకన చేసి మాట్లాడతారా, నీకేం తెలుసు పోవయ్యా అంటారా, నీకు దిక్కున్న చోట అప్పీలు చేసుకోమంటారా. ప్రజానాయకుడన్న ఖాతరు లేకుండా అవమానాలు చేస్తారా. అమ్మ బీడి ఓ. ఇన్నాళ్ళకు కృష్ణానందంగార్కి లేచి నమస్కారం పెడతావా. ఎంతవాడివి ఎలా దొరికిపోయావు” అనుకున్నారు ప్రజలు, ముఖ్యంగా కూలీలు, రైతులు, ఉపాధ్యాయులు.

బీ.డి.ఓ. చలపతిరావుకు గుండెలు జారిపొయ్యాయి. గత నాలుగేళ్ళుగా కృష్ణానందం గార్ని ప్రతి సమస్య మీదా ముప్పుతిప్పలు పెట్టాడు. ఏమీ తెలియని అజ్ఞానిలా జమకట్టాడు. అవసరాలు తీర్చకపోగా అన్నింట్లోనూ కలెక్టరుకు రిపోర్టు పంపించాలన్నాడు! ఈసారి కూడా రైతులు విత్తనాలకోసం బీడీఓ దగ్గరకు వెళితే కుదరదన్నాడు.

చేసేది లేక మళ్ళీ కృష్ణానందం గారి దగ్గరకు వెళ్ళారు. కృష్ణానందం

ఆశ్చర్యపోయాడు. కోపమొచ్చింది. చలపతిని పిలిపించాడు.

"ఏమయిందీ విషయం?” అనడిగాడు సమితి ప్రెసిడెంటు కృష్ణానందం!......................

  • Title :Malli Eppudostavakka? ? ? ? ? ?
  • Author :Chandu Subbarao
  • Publisher :Samata Publishers
  • ISBN :MANIMN6312
  • Binding :Papar Back
  • Published Date :2019 2nd print
  • Number Of Pages :121
  • Language :Telugu
  • Availability :instock