• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Manasu Palike

Manasu Palike By Varaprasad Reddy

₹ 100

మనసు పలికే...

జీవితం ఓ రాగమాలిక. అనుభవాల స్వరరంజితం. దీనిలో కోమల గాంధారాలు వుంటాయి, తీవ్ర మధ్యమాలు వుంటాయి. పూలపాన్పు లుంటాయి, ముళ్లబాటలుంటాయి. అపజయాల సోపానాలెక్కితేనే విజయ శిఖరం చేరగలం. శిఖరారోహణ తర్వాతనే ప్రారంభమవుతుంది అసలైన యిరకాటం. విజయాన్ని నిభాయించడం, అపజయాన్ని తట్టుకోవడం కంటే కష్టం.

నేను ఓ కేంద్రప్రభుత్వ ఉద్యోగిగా నా కెరియర్ ప్రారంభించాను. మేధోచౌర్యాన్ని భరించలేక రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా మారాను. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, ప్రోత్సహించి, ఓ శుభముహూర్తాన నేనే ఓ పారిశ్రామికవేత్తతో భాగస్వామిగా మారాను. ఆ వ్యాపారంలో విజయాలు చవి చూశాను. అవార్డులు పొందాను. కానీ, 7 సం॥లకే బయటకు రావలసి వచ్చింది. అప్పుడు జీవితాన్ని మరోరకంగా మలచుకున్నాను. నేను అధ్యయనం చేయని, నాకు అనుభవం బొత్తిగా లేని రంగానికి మళ్లాను. ఒడిదుడుకులు పడ్డాను. తెలిసి కొంత, తెలియక కొంత పొరబాట్లు చేశాను. చివరకు ఓ మెట్టు ఎక్కాను. పేరుప్రఖ్యాతులు వచ్చాయి కానీ వ్యాపారపరంగా అవి వుపయోగపడలేదు. కోరుకున్న లక్ష్యాన్ని చేరడానికి ధర్మం తప్పని వినూత్న పద్ధతులు అవలంబించాను.

అన్యాయం జరుగుతోందనుకున్నప్పుడల్లా. ధైర్యంగా ఎదిరించాను. గొంతెత్తి ప్రతిఘటించాను. మాటుగా విమర్శించాను. అవి కొన్నిసార్లు అనుకూల ఫలితాలనిచ్చా యి. కొన్ని ప్రతికూల ఫలితాలు ప్రసాదించాయి. గమ్యాలు| మారుతున్నాయి. గమనం సాగుతూనే వుంది.

ఈ దశలో 'ఈనాడు' పాఠకులతో నా అనుభవాలు పంచుకునే అవకాశం వచ్చింది. చెప్పానుగా - నా జీవితమూ స్వర్ణరంజితమే! | ఉదాత్త అనుదాత్త స్వరాల సమ్మేళనమే. పట్టుదలతో పోరాడినపుడు స్వరంలో తీవ్రత కనబడుతుంది...........................

  • Title :Manasu Palike
  • Author :Varaprasad Reddy
  • Publisher :MBS Prasad
  • ISBN :MANIMN6328
  • Binding :Papar back
  • Published Date :Jan 2025 7th print
  • Number Of Pages :276
  • Language :Telugu
  • Availability :instock