• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Manava Samajam

Manava Samajam By Rahul Samkruthyan

₹ 350

1వ అధ్యాయము
 

మానవ సమాజ వికాసము

ఒకప్పుడు భూమి మండుతున్న గోళము, అణువులు చెల్లాచెదురై ఉన్నాయి. అవి క్రమేపి కలవడం జరిగింది. అణు సముదాయాలు ఏర్పడి వైర్లను, బాక్టీరియా ఏర్పడింది. వెన్నెముక లేని అమీబాలవంటివి (జంతువులు) పుట్టాయి. తర్వాత ప్రకృతి నుండి తిన్నగా ఆహారాన్ని తీసుకొనే వనస్పతి పుట్టింది. ఆహారం కొరకు ఇతర వాటిపై ఆధారపడి జీవించే చరములు పుట్టాయి. మత్యయుగంలో భూచర, జల చరములు పుట్టాయి. వానిలో కొన్ని గాలిని, కొన్ని భూమిని అంటిపెట్టుకొని వున్నాయి. నాటి నుండి జీవుల ఉత్పత్తి మొదలయింది. స్తనధారులు, వానరములు, వనమానవులు, తర్వాత అర్ధ వన మానవులు, అర్ధ మానవులు, ద్విపాద జీవులు వచ్చారు. వానిలో కొన్ని జీవులు ఎక్కువ మార్పులు పొందాయి. వారు మనకు పూర్వీకులు. 20 లక్షల సంవత్సరాల నాడు సాయుధ మానవుడు వున్నట్లు తెలుస్తుంది. నేటికి ఐదువేల సంవత్సరాలకు పూర్వం ఆలోచించే మానవులు అనగా ఆధునిక మానవుని పూర్వీకులు (హోమోసేసియన్) ఉన్నట్లు తెలుస్తుంది.

మానవ సమాజము

ప్రారంభంలో మానవుని వికాసం చాలా నెమ్మదిగా జరిగింది. ఆ కాలంలో, ఆ స్థితిలో అలా అయినా జరగడమే చాలా గొప్ప. ఆ జీవులను చూడటంతోనే వారు పశువులు కారని, వారు పశువులకు భిన్నమైన ప్రాణులని తెలుస్తుంది. అలా అనుకొనే ముందు మానవుని చేతులు మెదడు, భాష ఎలా ఏర్పడ్డాయి అనేది మనముందున్న ప్రశ్న: ప్రయత్నం అంటే జీవించటానికి చేసే ప్రయత్నం. జీవ పరిణామానికి సహాయపడింది జీవపరిణామ సిద్ధాంతం అని అదే తెలిసిన వారందరికి తెలుసు. కాని దానికి ప్రకృతి తోడ్పాటు లేదని అనుకోరాదు.....................

  • Title :Manava Samajam
  • Author :Rahul Samkruthyan
  • Publisher :Nava Telangana Publishing House
  • ISBN :PRAJASHT21
  • Binding :paperback
  • Published Date :5 th edition 2024
  • Number Of Pages :366
  • Language :Telugu
  • Availability :instock