• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Matsyagandhi

Matsyagandhi By Veluri Krishnamurty

₹ 90

యమున వద్దకు దయచేసిన మునివర్యులు

యమునా నదీ తీరంలో నిలబడి నదీ ప్రవాహాన్ని చూస్తూ వుండడం ఆమె దినచర్య. తండ్రి దాశరాజ ఆమెకు చిన్నప్పటినుంచే యమున గురించి వివరించి తెలుపుతుండేవాడు.

'యమున మన తల్లి. జీవితానికి ఏమి కావాలో దానిని మనకు ప్రసాదిస్తుంది. నావను నడిపే ఈ విద్య నా తండ్రి నాకు నేర్పాడు. నేను నీకు నేర్పించా. జీవితం ఒక నావలాంటిది. దానిని సంసార సాగరంలో మునిగిపోనీకుండా తీరం చేర్చడం ఒక కళ. దానిని నేర్పడం అసాధ్యం. అనుభవంతో నేర్చుకోవాలి.

'యమున ఎక్కడినుండి వస్తుందప్పా?'

'నేను చూడలేదు. ఆవతల ఉత్తరానికి హిమాలయ పర్వత శ్రేణులున్నవి. అక్కడే ఎక్కడో ఒకచోట యమునోత్రి అన్న ఒక ప్రదేశమున్నదట. అది యమున జన్మించిన చోటట. హిమాలయాల వైపునుండి వచ్చిన ఒక ఋషి ఈ విషయం తెలిపాడు. అతను భరత ఖండాన్నంతా సంచరించాలని బయలుదేరినవాడు. నదీ మూలాన్ని అడుగ

కూడదట. అయినా అడిగావు. నేను దానిని అడుగడానికి పోలేదు'.

యమునానది తీరంలో నిలబడి నది పారుతుండడాన్ని చూస్తున్నపుడు ఆమెకు ఋషి తెలిపిన మాటలు జ్ఞాపకానికి వచ్చేవి. 'ఓ స్త్రీ, జ్ఞాపకం పెట్టుకో! జీవితం ఒక నది లాంటిది. జన్మించడం, మరణించడం అన్నవి ఆ నది రెండు దడులు. నదిలాగ జీవితం పారుతూండాలి. లేకుంటే బ్రదికివున్నా చచ్చినట్టే!'

అది మొట్టమొదటిసారి ఋషి తన శరీర సుఖాన్ని అనుభవించినపుడు ఆడిన మాటలవి. అనంతరం అదెన్నిమార్లు అతను ఆ మాటలను అన్నాడో! తన తండ్రి దాశరాజు ఎదుటకూడ అవే మాటలు పునరావృతమయ్యేవి. అతడామెను శాశ్వతంగా విడిచిపోయేటపుడూ అవేమాటలన్నాడు. ఎంతటి అర్థవంతమైన మాటలవి! అలా చెప్పి వెళ్ళినవాడు మరలా వెనుదిరగలేదు. అతడివెంట ఆమె వెళ్ళివుండవచ్చు. అతడు పిలువ లేదు. పిలిచివున్నా తల్లితండ్రులను విడిచి జంగమ బ్రదుకు బ్రతికే ఋషివెంట తిరుగడం అసాధ్యం. అందుకు తన తల్లి-తండ్రి అంగీకరించేవారూ కాదు!....................

  • Title :Matsyagandhi
  • Author :Veluri Krishnamurty
  • Publisher :Palapitta Publications
  • ISBN :MANIMN6295
  • Binding :Paerback
  • Published Date :March, 2019
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock