₹ 150
మాది దేవరయాంజాల గ్రామం. రంగారెడ్డి జిల్లా ప్రస్తుత శామీర్ పేట మండలం(గతంలో మేడ్చల్ తాలూకా) లో ఉంది. 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాగా విస్తరించింది. నేను అప్పుడు పదవతరగతి చదువుతున్నాను. నాకు 15 సంవత్సరాలుంటాయి. ఉవ్వెత్తున కెరటంలా వచ్చిన ఆ ఉద్యమంలో తడవకుండా ఉండలేకపోయాను.
ఆ రోజుల్లో బంద్ పిలుపులు ఎక్కువగా వచ్చాయి. వరుసగా కొన్ని రోజులపాటు బంద్ కు పిలుపు ఇచ్చినట్టు కూడా జ్ఞాపకం. ఆ సమయంలో బంద్ లో పాల్గొనాలంటే ఏం చేయాలి?... మాది పెద్ద గ్రామమే అయినా బంద్ లో పాల్గొనే అవకాశాలు లేవు. వ్యవసాయం, కుల వృత్తులు తప్ప మరే కార్యక్రమాలు అక్కడ జరగవు. కాబట్టి పొరుగున ఉన్న తూంకుంట గ్రామానికి విద్యార్థులం బయలుదేరాం.
- వుప్పల నరసింహం
- Title :Naadam
- Author :Uppala Narasimham
- Publisher :Gnanam Publications
- ISBN :MANIMN0490
- Binding :Paperback
- Published Date :2009
- Number Of Pages :196
- Language :Telugu
- Availability :instock