Logili Books

Novels

Naalo Nenu

By Addanki Santakumari

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Naalo Nenu
Publisher
Emasco Books pvt.L.td.
ISBN
MANIMN6996
Binding
Paparback
Published Date
July, 2024 2nd print
Number Of Pages
206
Language
Telugu
Availability
In Stock
About this book

మంచి మనుషులున్న మా ఊరు ‘మృత్యుంజయపాలెం’

సొంత ఊరు కన్నతల్లిఅంతటి గొప్పదని అంటారు. మా ఊరి పేరు మృత్యుంజయపాలెం. మృత్యుంజయపాలెం అంటే మృత్యువు (చావు)ని జయించిన వారు ఉండే ప్రదేశం అని మా పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుజిల్లా, రేపల్లె మండలంలో ఉన్న మా ఊరు బంగాళాఖాతానికి దగ్గరలో ఉంది. చిన్న ఊరు. అంతా కలిపితే 500 గడప ఉండేవేమో!

నా చిన్నప్పుడు మా ఊరు చాలా సందడిగా ఉండేది. ఊళ్లో దాదాపు అందరూ ఒకరికొకరు తెలిసినవాళ్లే. చుట్టుప్రక్కలవాళ్ళు అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. ప్రతివాళ్లకూ చుట్టాలు ఊళ్లోనే ఉండేవారు. చాలావరకు ఉమ్మడి కుటుంబాలు.

మా ఊళ్లో ఎక్కువ వ్యవసాయం జరిగేది. మాదీ రైతు కుటుంబమే. అందువల్ల నాకు పొలాలు కొద్దిగా తెలుసు. ఇంట్లో ఆవులు, గేదెలుండేవి, వాటి దూడలతో మేం ఆటలాడేవాళ్లం. పొలం పనులకు, పశువులను చూడటానికి జీతగాళ్ళు ఉండేవాళ్ళు.

మా ఇంటి ప్రక్కనే రామాలయం. ఊళ్లో శ్రీరామనవమి బాగా చేసేవాళ్ళు. ఊరంతా తెల్లవారుజామునే లేచి స్నానంచేసి రెడీ అయ్యేవాళ్ళం. మా నాన్నగారు, ఇంకొంతమందితో కలిసి దేవుళ్ళని కృష్ణానదికి తీసికెళ్ళి, స్నానాలు చేయించి మేళాలతో దేవాలయానికి తీసుకొచ్చేవాళ్ళు. అప్పటికి ఉదయం.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?