• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Neeli Kalla Nela

Neeli Kalla Nela By Pallipattu Nagaraju

₹ 150

బహు బాహువుల బహుజన కవి

ఈ కాలపు కవుల కళ్ళల్లోకి చూడాలంటే ఏదో అపరాధ భావంతో, మరేదో భయంతో హృదయమంతా బరువు బరువుగా ఉంటుంది. వీళ్ళకి మనం ఏం మిగిల్చాం? వీళ్ళ కోసం కొన్ని తోటలైనా ఉన్నాయా? వీళ్ళు కడుపారా గ్రోలి తూలడానికి కాస్త వెన్నెలైనా మిగిలిందా? కాలం ఇసుక తిన్నెమీద నీడల రతిక్రీడలలో ఆదమరిచిన నిద్రల స్మృతి కావ్యాల రచనకు కాస్త సమయమైనా వీళ్లకు వారసత్వంగా ఇవ్వగలిగామా! అయ్యో నా బిడ్డల్లారా.. మీ కనురెప్పల మీద ఎంత దుఃఖ భారాన్ని మోపాము! చుట్టూ చీకటి. కడుపులో ఆకలి, నేలంతా రాతి ముళ్ళ నెత్తుటి స్పర్శ. క్రూర సర్పాలతో నిత్య మర్షణ. నిర్బంధాలు.. నిషేధాలు.. ఆధిపత్యాలు.. అణచివేతలు.. కులవర్గ మతదుర్గమారణ్యాల నిత్యసంచారాల సంకుల సమరాలు. అయ్యో నా తండ్రుల్లారా.. ఇంక మీరు పక్షులతో గొంతెలా కలుపుతారు? చెట్ల మీంచి ఉరికే నీడల జలపాతాల్లో ప్రేమోద్విగ్న నగ్నస్నానాల గానాలు ఎలా చేస్తారు? పాలస్తీనా, ఇజ్రాయిల్ ఎక్కడో లేవు. అన్నీ ఇక్కడే. ఆట బొమ్మలు ఉండాల్సిన చేతుల్లో తుపాకులు పెట్టిన దుర్మార్గపు కాలం ఇది. ఈ పిల్లల భుజాల మీద ఒక దేశాన్ని మోపి మీరు ఆడుకోండి నాయనా అంటున్నాం..............

  • Title :Neeli Kalla Nela
  • Author :Pallipattu Nagaraju
  • Publisher :Pallipattu Nagaraju
  • ISBN :MANIMN6449
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :141
  • Language :Telugu
  • Availability :instock