• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Oka Adugu Munduki Rendu Adugulu Venakki V I Lenin

Oka Adugu Munduki Rendu Adugulu Venakki V I Lenin By Kondepudi Lakshmi Narayana

₹ 250

ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి
 

(మన పార్టీలో సంక్షోభం)
 

ముందుమాట

ఒక సుదీర్ఘమైన, పట్టుదలతో కూడిన, ఉద్రిక్తమైన పోరాటం సాగుతూ వున్నప్పుడు, సాధారణంగా కొంతకాలం అయిన తరువాత వివాదంలో వున్న విషయాలకు సంబంధించిన ముఖ్యమైన, మౌలికమైన అంశాలు బయటపడం ప్రారంభం అయ్యింది. వాటి పరిష్కారంపైనే ఆ ఉద్యమం తుది ఫలితం ఆధారపడి వుంటుంది. వాటితో పోల్చితే పోరాటంలోని స్వల్పమైన, చిన్నవైన ఘటనలన్నీ అంతకంతకూ వెనక్కిపోతాయి.

మన పార్టీ లోపల సాగుతూన్న పోరాట విషయం కూడా అలాగే వుంది. ఈ పోరాటం ఇప్పటికి ఆరు నెలలుగా పార్టీ సభ్యులందరి దృష్టినీ ఆకట్టి వుంచుతోంది. మొత్తం పోరాటం గురించి పాఠకులకు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో అత్యంత తక్కువ ఆసక్తికరమైన చాలా వివరాలనూ, నిజానికి ఎలాంటి ఆసక్తికరమైనవీ కాని చాలా జగడాలనూ ప్రస్తావించవలసి వచ్చినందున నేను మొట్టమొదట నిజంగా ముఖ్యమైన, మౌలికమైన రెండు అంశాలు పాఠకుని దృష్టికి తేదల్చుకున్నాను. అవి ఎంతో ఆసక్తికరమైనవీ, నిస్సందేహంగా చారిత్రక ప్రాముఖ్యంగలవీ, నేడు మన పార్టీని ఎదుర్కొంటున్న అత్యంత జరూరైన రాజకీయ సమస్యలు.

మొదటి సమస్య, మన పార్టీ "మెజారిటీ" "మైనారిటీ"లుగా విడిపోవడం. రాజకీయ ప్రాముఖ్యం గురించిన సమస్య. అది పార్టీ రెండవ మహాసభలో ఒక రూపం ధరించింది, రష్యన్ సోషల్ డెమోక్రట్లలో అంతకు పూర్వం వున్న చీలికలన్నిటినీ వెనక్కి తోసి వేసింది.....................

  • Title :Oka Adugu Munduki Rendu Adugulu Venakki V I Lenin
  • Author :Kondepudi Lakshmi Narayana
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN6267
  • Binding :Papar Back
  • Published Date :April, 2025
  • Number Of Pages :269
  • Language :Telugu
  • Availability :instock