Logili Books

Novels

Oka Nenu Oka Canada ( Vipula, Chatura, Nenu- 2)

By Yarlagadda Raghavendrarao

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Oka Nenu Oka Canada ( Vipula, Chatura, Nenu- 2)
Publisher
Aju Publications
ISBN
MANIMN6993
Binding
Paparback
Published Date
April, 2026
Number Of Pages
161
Language
Telugu
Availability
In Stock
About this book

మళ్ళీ జన్మనిచ్చిన అమ్మ

విపుల, చతుర పత్రికలతో బంధం తెంచేసుకుని వచ్చాక ట్రావెల్ ఏజెంట్ను కలిశాను. అతడితో అంతకు ముందు నుంచే నేనూ కెనడాలోని మా ఆవిడా టచ్ ఉన్నాం. కెనడాలో మూడేళ్ళు ఉండి సిటిజర్షిప్ తీసుకున్నాక వెనక్కి వచ్చేసి హిమాయత్నగర్ లార్వెన్ (లార్డ్ వెంకటేశ్వర) ట్రావెల్స్ పేరిట ఓ ఏజెన్సీ పెట్టుకున్నాడు అతగాడు. మేం మొదటిసారి కెనడా వెళ్ళినప్పుడు టికెట్లు ఏర్పాటు చేసిందీ అతడే. ఏప్రిల్ 24వ తేదీ నాటికి కెనడాలో ఉండేటట్టుగా టికెట్ చూడమన్నాను. అలాగే 23 రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి 24 సాయంత్రం అక్కడ దిగేలా ఏర్పాటుచేశాడు.

ఏప్రిల్ 24కే ముహూర్తం ఏంటబ్బా అంటే... అది... నా పుట్టినరోజు! అవునా అంటే ఏమో అవునేమో అని సమాధానం చెప్పాల్సొచ్చే పుట్టినరోజు. మా ఆవిడ ఝాన్సీలక్ష్మి శోధించి లెక్కకట్టి తేల్చినదాని ప్రకారం ఈ నేలమీద నా బుడిబుడి పాదాల్ని మోపిన రోజు అదే. ఏంటీ పుట్టినరోజుకూ ఇలాంటి మతలబు ఉంటుందా అంటూ తల ఓ పక్కకు 30 డిగ్రీల కోణంలో వాల్చేసి కనుబొమలు ఎగిరేసి అలా పెద్దపెద్ద చూపులు విసరకండి. ఉందనే చెబుతున్నాగా. 'అదే ఎందుకూ?' అని ఇంకెవరైనా ఠపీమంటూ ఇంకో ప్రశ్న సంధిస్తే, 'అదంతే, మనిషిలోని మాత్సర్యం మహిమ,' అని చెప్పాల్సొస్తుంది.......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?