• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Papisti Dabbu

Papisti Dabbu By Machiraju Kameswara Rao

₹ 55

                  చిన్నతనం నుంచే విడవకుండా కథలు రాస్తున్న వీరు 21 మే 1955న తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో, శీతారామయ్య, రత్నకుమారి దంపతులకు జన్మించారు. మొదటికథ 'గుడ్డివాడి డబ్బు' 1969లో రాశారు. అది 'చందమామ'లో ప్రచురితమైంది. 'చందమామ' లోనే వీరి కథలు 250 పైన ప్రచురించబడ్డాయి. బాలజ్యోతి, స్నేహబాల, బుజ్జాయి మొ|| ఇతర బాలల పత్రికలలో 150 వరకు కథలు ప్రచురితమయ్యాయి.

                   ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, స్వాతి, ఆంధ్రభూమి, విపుల, ఆంధ్రజ్యోతి వగైరా పత్రికలలో 100 వరకు కథలు, స్వాతి మాసపత్రికలో 4 నవలలు, చతురలో ఒక నవల ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి కథల పోటీలో 'పిచ్చితల్లి' కథకి ద్వితీయ బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ నిర్వహించిన జానపద నవలల పోటీలో ‘అడుగుకో ఆపద' నవలకు ప్రథమ బహుమతి లభించింది.

                   వీరి విధి నిర్వహణ' కథ మహారాష్ట్ర గవర్నమెంట్ వారి 6వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది. వీరు రాసిన, 'పారిపోయిన దొంగ' కథను కేంబ్రిడ్జి యూనివర్శిటీ వారు పరీక్ష పేపర్ లో ఉపయోగించుకోవటం తెలుగువారికి గర్వకారణం. ఈ-టీవీలో 'స్త్రీ-నైజం' కథ టెలిఫిల్మ్ గా 4 నంది అవార్డులు గెలుపొండం విశేషం.

                   20క కథలతో 'చందమామ కథలు' పేరిట విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఒక పుస్తకం ప్రచురించింది. బాలసాహిత్యంలో వీరు చేసిన సేవలకుగాను, 2013లో 'చక్రపాణి - కొలసాని' పురస్కారంతో సత్కరించబడ్డారు. కెనరాబ్యాంకు మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లో నివాసముంటున్నారు.

-

  • Title :Papisti Dabbu
  • Author :Machiraju Kameswara Rao
  • Publisher :Amaravathi Publications
  • ISBN :MANIMN3090
  • Binding :Paerback
  • Published Date :2018
  • Number Of Pages :36
  • Language :Telugu
  • Availability :instock