• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Parisaralu Vignanam

Parisaralu Vignanam By Oddiraju Muralidhararao

₹ 100

ఆమ్లవర్షం

మానవుడు అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాడు. ఈ అభివృద్ధిలో తనకు తెలియకుండానే తను ప్రమాదకర పరిసరాలను సృష్టించుకుంటున్నాడు. ప్రతిరోజు ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ఫ్యాక్టరీలు కొత్తగా స్థాపించుకున్నారు. ఇదే తీరుగ మోటారు వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతునే వుంది. వీటినుండి వెలువడే పొగతో సల్ఫరై ఆక్సాయిడ్, నైట్రోజన్ ఆక్సాయిడు గాలిలోకి చేరుతోంది. గాలి సహాయాన ఈ రసాయన పదార్థాలు ఎన్నో వేల కిలోమీటర్లు పయనిస్తాయి. అచ్చట అవి వర్షపునీరుతో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లముగా, నత్రిక ఆమ్లముగా మార్పుచెంది వర్షంతోపాటు భూమిపై కురుస్తాయి. దీన్నే ఆమ్లవర్షం అంటే ఆసిడ్ రేస్ అంటారు.

ఆమ్లవర్షం అనే మాట ఇప్పుడు కొత్తగా వచ్చినదేమీ కాదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇంగ్లాండులోని మ్యాన్చెస్టరులో ఆమ్లవర్షమనే మాటను ప్రథమంగా వాడి ఉండిరి. ఇప్పుడు మాత్రం దాని ప్రభావాన్ని అంతర్జాతీయ సమస్యగా గుర్తించారు. మ్యాన్చెస్టరు వారు వారి పరిసరాల్లో కాలుష్యం గురించి ఫిర్యాదు చేసినపుడు పారిశ్రామికులు సుమారు 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుగల పొగగొట్టాలు కట్టించారు. దీనివలన కాలుష్య పదార్థాలు ఆ చుట్టు ప్రక్కల పడకుండా ఎంతో దూరం వయనించి ఇతర దేశాల్లో ప్రవేశించేవి. మానవ పరిసరాలపై పడే ప్రభావం గురించి మొదటిసారి 1972 లో స్వీడెన్ దేశంలో జరిగిన ఐక్యరాజ్య కాన్ఫెరెన్సులో చర్చించారు. మొదట్లో స్వీడెన్ అభిప్రాయాన్ని నమ్మలేదు కాని గత పది సంవత్సరాల్లో ఆమ్లవర్షంపై ఎంతో పరిశోధన జరిగి అది ఒక పెద్ద అంతర్జాతీయ సమస్యగా ఏర్పడింది........................

  • Title :Parisaralu Vignanam
  • Author :Oddiraju Muralidhararao
  • Publisher :Vijay Prachuranalu
  • ISBN :MANIMN6299
  • Binding :Papar Back
  • Published Date :2023 2nd print
  • Number Of Pages :142
  • Language :Telugu
  • Availability :instock