వైజాగ్ సిటీ కి 40 కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్ దాని చుట్టూ ఒక ఎకరం స్థలం. చుట్టుపక్కల చాల ప్రశాంతంగా ఉంది, ఎకరం చుట్టూ గోడ కట్టి ఉంది. సముద్రపు అలల శబ్దం చిన్నగా వినిపిస్తోంది, చుట్టూ ఉన్న చెట్ల సముదాయముల వల్ల చల్లని గాలి వస్తోంది.
మూడు కార్స్ ఆ బిల్డింగ్ ముందు ఆగాయి, మొదటి కార్లోంచి ఒక 26 ఏళ్ళ యువకుడు దిగాడు, అతను వైజాగ్ లో ఉన్న తెర్మాస్ లో మెకానికల్ ఇంజనీర్ గ వర్క్ చేస్తున్నాడు. నెలకి 50 వేలు జీతం.
రెండవ కార్ నుంచి ఒక 24 ఏళ్ళు ఉన్న అమ్మాయి దిగింది, ఆమె బీటెక్ పూర్తి చేసి అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తోంది, నెలకి 40 వేలు జీతం తో.
మూడవ కార్ నుంచి ఒక రాజకీయ నాయకుడు దిగాడు, అతను సిటీ లో ఒక ఏరియా MLA, అతని ఆదాయం మనం చెప్పుకోలేనంత.
ముగ్గురు గేట్ దగ్గరకి వచ్చారు, సెక్యూరిటీ ఎవర్ని కలవాలి అని అడిగాడు, స్కూల్ చూడాలి అని చెప్పారు ముగ్గురూ, జైదేవ్ గారి పర్మిషన్ లెటర్ ఉందా అని అడిగాడు, ఎవరు అన్నారు ముగ్గురు
జైదేవ్ సూర్యనారాయణ వరప్రసాద్ జైదేవ్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని చెప్పాడు సెక్యూరిటీ.
ఆయన అన్ని ఇండస్ట్రీస్ లలో ఈ స్కూల్ ఒకటి దీన్ని చూడడానికి ఇక్కడ ఉండే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలి, పర్మిషన్ ఎందుకు అని అడిగింది ఆ అమ్మాయి.
మీరు చెప్పేది నిజమే కానీ ఇక్కడ అయన ఎక్కువ ఉంటారు లేదా తన బెస్ట్ ఫ్రెండ్ జోన్స్ ఉంటారు, వీళ్ళిద్దరూ లేనపుడు స్కూల్ ప్రిన్సిపాల్ ముస్తాక్ ఉంటారు. పిల్లలకి ఏదయినా అవసరం వచ్చిన పేరెంట్స్ కి స్కూల్ మీద ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు మీకు అన్ని వివరించి చెప్తారు.
అయినా స్కూల్స్ మీద అంత ఇంటరెస్ట్ దేనికో అది ఒక బిజినెస్ ఏ కదా వీళ్ళకి అని అన్నాడు ఆ అబ్బాయి..........