₹ 120
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం ప్రజాప్రతినిధులతోపాటు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఇష్టంలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యుపిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని నిట్టనిలువునా రెండుగా చీల్చివేసింది. విభజన ప్రక్రియలో, విభజన చట్టం రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంటు ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరగకుండా, ఆంధ్ర ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం ఇవ్వకుండా హడావుడిగా బిల్లుని ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 2014 జనవరి 30న ఆంధ్రప్రదేశ్ శాసన సభ తీర్మానం చేసింది. అయినా ఫిబ్రవరి 18న లోక్ సభలో, 20న రాజ్యసభలో దీనిని ఆమోదించారు. బీజేపీ నేతలు కూడా మద్దతు పలికారు. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతిదనిధులు మాటలకు విలువకుండా చేశారు. వారి డిమాండ్లను వినిపించుకున్న నాధుడులేడు.
- శిరందాసు నాగార్జున
- Title :Prajarajadhani Amaravati
- Author :Seeramdasu Nagarjuna
- Publisher :Seeramdasu lakshmi kameswari
- ISBN :MANIMN0416
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock