అమ్మ కదా!
కురిసి వెలిసింది వాన.
పచ్చని చెట్లు, చుట్టూ పొలాలు,
పొడవాటి రోడ్డు పక్కన గంభీరంగా నిలబడి ఉంది బడి.
పదిమంది
చినుకు ముత్యాల్లాంటి పిల్లలు.
వాళ్ల కళ్ళ నిండా ఆనందం.
ఓ లోకంలోనికి నెమ్మదిగా జారిపోతుంటుంది.
టీచర్ రోజూ.
వర్షఋతువెంత అందమైనది!
నారు మడిలో మొలకల్లా పిల్లలంతా ఓ చోట చేరారు.
ఎక్కాలు, ఒత్తులు, గుణింతాలు, రైమ్స్, ఆటలు
ఒకటేమిటి వాళ్ళ చదువులకు పరిమితమే లేదు మరి.............................