• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Ravindruni Kathalu

Ravindruni Kathalu By Oddiraju Muralidhararao

₹ 150

నాయంజోరు దొరలు

ఒకానొక సమయంలో నాయంజోరు దొరలు పేరుగాంచిన దొరలు. వారు రాజసమైన వృధాఖర్చులకు ప్రసిద్ధులు. వారు వారికాళ్ళకు డాకా మస్లిన్ బట్ట బార్డరు గీరుకుంటుందని ఆ భాగాన్ని చింపివేసేవారు. పిల్లి పెండ్లికి వేల రూపాయలు ఖర్చుచేసేవారు. కొన్ని గొప్ప సందర్భాల్లో వారు రాత్రిని పగలువలె మార్చేందుకు లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ బల్బులు వెలిగించేవారు. అంతేగాక, ఆ వెలుతురుకు సన్నని వెండితీగలను చాలా ఎత్తునుండి జారవిడిచేవారు. దానివలన ఆ రాత్రి పగలుగా కనిపించేది. అవి ఉప్పెనకు ముందురోజులు. వంశ పరంపరంగా ఆ దొరలు, వారి అలవాట్లు ప్రకారం చాలాకాలం జలసాలు జరిపించ లేక పోయారు. ప్రమిదలోని నూనె, ఎక్కువ వత్తులు వెలిగించడంతో కొద్ది సమయం లోనే నిండుకున్నట్లు, వారి ఆస్తులుకూడా కర్పూరంవలె కరిగిపోయాయి.

కైలాసబాబు మా పక్కింటతను. ఆ గొప్పవంశం వారిలో చివరివాడు. ఆయన ఎదిగేలోపే వారి కుటుంబం దీనస్థితికి చేరింది. అతని తండ్రి చనిపోయినపుడు శవయాత్ర సమయంలో పెట్టిన విపరీత ఖర్చులవలన తీర్చలేని బాకీలో పడిపోయింది కుటుంబం. బాకీలు తీర్చేందుకు ఆస్తి అమ్మివేశారు. ఏ కొద్ది డబ్బు మిగిలిందో దానితో పూర్వపు ఘనత నిలబెట్టలేకపోయాడు కైలాస్బాబు.

కైలాస్బాబు నాయంజోరు వదిలి కలకత్తా నగరం చేరాడు. అతని కుమారుడు ఈ మాసిపోయిన వైభవంలో ఎక్కువకాలం ఉండలేదు. అతను సోదరిని వెనుక వదిలి చనిపోయారు.

కలకత్తా నగరంలో మేము కైలాస్బాబు పొరుగువారము. చాలా విచిత్రమైన విషయం. మా పరిస్థితి పూర్తిగా వారికి విరుద్ధం. మా తండ్రిది స్వయంగా తన శ్రమతో సంపాదించిన ధనమే, మరియు ఒకపైన కూడా అనవసరంగా ఖర్చు పెట్టేవాడు కాదు. అతని చేతులు, దుస్తులు పనివాండ్ల వాటివలె ఉండేవి..................

  • Title :Ravindruni Kathalu
  • Author :Oddiraju Muralidhararao
  • Publisher :Oddiraju Muralidhararao
  • ISBN :MANIMN6297
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock