• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Samsrutha

Samsrutha By Janaradhan Maharshi

₹ 150

సంస్కృత

సంస్కృత ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం అయ్యింది. చేతిలో బ్యాగ్. బ్యాగ్ ఉరి వేసుకోవడానికి రోప్ ఉంది. ఆమె ఓ పెద్ద యూనివర్సిటీలో లైబ్రేరియన్. గతంలో వాళ్ళ నాన్నగారుకూడా అదే. అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆ ఉద్యోగం సంస్కృతకి వచ్చింది. తండ్రి అలా చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఈమెకి తెలీదు. కానీ, ఈమె ఇలా చేయాలనుకోవడానికి కారణాలు ఉన్నాయి అని ఆమె తీవ్రంగా భావిస్తోంది.

ఈరోజు ఆదివారం. యూనివర్సిటీకి సెలవు దినం. అందుకే ఆమె కూడా సెలవు తీసుకోవడానికి కరెక్ట్ దినంగా భావించింది. తనకు మూడేళ్ళుగా అనుబంధమున్న ఆ లైబ్రరీనే చనిపోవడానికి బెస్ట్స్ డిసైడ్ అయ్యింది. ఇంతకీ ఆమె వయస్సు తెలియాలి కదా; అవును, ఆమెకి మొన్ననే 30 వచ్చాయి.

యూనివర్సిటీ లైబ్రరీ చాలా పెద్దది. అందులో కొన్ని వందల ర్యాక్స్లో కొన్ని లక్షల పుస్తకాలున్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషా రచయితలు, కవులు, నాటకకారులు, క్రియేటర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి. ఫిలాసఫీ, పోయెట్రీ, సైకలాజికల్ నవల్స్ దాదాపు కొన్ని వందలు సంస్కృత చదివింది. నిజానికి ఆమెకి చిన్నప్పట్నుంచే పుస్తకాలు చదవటం అంటే పిచ్చి. అది వాళ్ళ నాన్న గారి దగ్గర్నుంచి సంక్రమించింది. చివరికి ఆత్మహత్య కూడా...

లైబ్రరీ తలుపులు తీసింది. లోపలికి వచ్చింది. ఆమె మొహం చూస్తే depres- sion, frustration, anxiety లాంటివి లేవు. ఆమె చావడానికి వచ్చిన face లా లేదు. ప్రశాంతంగా చావడానికి వచ్చింది. కాబట్టి ఆమె face చాలా అందంగా ఉంది. సంస్కృత కూడా చాలా అందంగానే ఉంటుంది...................

  • Title :Samsrutha
  • Author :Janaradhan Maharshi
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN6736
  • Binding :Papar back
  • Published Date :2025
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock