• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Shishira Sumaalu

Shishira Sumaalu By Varanisi Nagalakshmi

₹ 250

మళ్లీ మనిషిగా...

ఈ పదేళ్లలో ఉద్యోగాల్లో, జీతాల్లో, వాటితో పాటు ఎగువ మధ్య తరగతి జీవితాల్లో వచ్చిన మార్పుల్ని ఎత్తి చూపిస్తున్నట్టుంది, హైటెక్ సిటీలో మెరిసిపోతున్న హోండా షో

రూమ్.

ఎదురొచ్చి నన్నూ, స్వాతినీ లోపలికి తీసుకెళ్ళినతను కూడా అతికినట్టున్న నీలం రంగు సూట్లో హుందాగా మెరిసిపోతున్నాడు. రమేష్ పేరూ నే వచ్చిన పనీ చెప్పి, ముకుంద్ ని కలవాలన్నాను. తనే ముకుంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు.

లోపల గుండ్రటి టీ టేబుల్స్ చుట్టూ నాలుగేసి కుర్చీలు వేసి ఉన్నాయి. వచ్చిన కస్టమర్స్ కి అతి శ్రద్ధగా మర్యాదలందిస్తున్నారు, ముకుంద్ లాంటి వాళ్లే మరికొందరు. అతను చూపించిన కుర్చీల్లో కూర్చుని, కొనదల్చిన కారు వివరాలు చెప్పాను.

అవన్నీ అలవాటే అన్నట్టుగా స్పెసిఫికేషన్స్ తెలియజేసే పత్రాలు తెచ్చి, వివరాలన్నీ నింపమని ఇచ్చాడు. నేనవి ఒకటొకటిగా నింపుతుంటే, ఒళ్లో పాపాయికి షోరూమ్ లో కార్లు చూపిస్తూ కూర్చుంది స్వాతి.

ముకుంద్ చెప్తున్న వివరాలు శ్రద్ధగా వింటుంటే ఇన్నాళ్ళ తర్వాత నేను కావాలనుకున్న ఒక లగ్జరీని పొందబోతున్న ఉత్సాహం ఒకవైపు, నే వేసుకున్న బడ్జెట్ సరిపోతుందా అన్న సందేహం ఒక వైపూ, నా ఎన్నిక సరైనదేనా అనే ఆందోళన మరో వైపూ పొట్టలో సీతాకోక చిలకల్ని ఎగరేశాయి.

టెస్ట్ డ్రైవ్ కోసం కారు తెరిచి లోపల కూర్చోగానే శరీరమంతా ఒక ప్రకంపన.... రోడ్డు మీద రివ్వున దూసుకుపోతున్న కార్లో ముందు ముందు మా ప్రయాణాల్ని................

  • Title :Shishira Sumaalu
  • Author :Varanisi Nagalakshmi
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5579
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :162
  • Language :Telugu
  • Availability :instock