నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుధస్స
దీఘనికాయ - మహావర్గం
1. మహాపదాన సూత్రం
పూర్వజన్మల కథనం
1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో, జేతవనంలో అనాథపిండికుని ఆరామంలో కరేరి (musk-rose tree) కుటీరంలో ఉన్నాడు. అప్పుడు అనేకమంది భిక్షువులు భోజనం చేసి, పిండపాతంనుండి తిరిగివచ్చిన తర్వాత గుండ్రని మంటపంలో సమావేశమై కూర్చొని, - పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది. ఇది ఇలా ఉండేది" అంటూ ధార్మికచర్చను మొదలుపెట్టారు.
అలా అనగా భిక్షువులు భగవానునితో - "ఇక్కడ, భంతే మేము భోజనం చేసిన తర్వాత పిండపాతం | నుండి తిరిగివచ్చి గుండ్రని మంటపంలో సమావేశమై కూర్చొని - పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది. పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది' అంటూ ధార్మిక చర్చను ఆరంభించాము. భగవానుడు , రావటం వలన అంతరాయం కలిగిన చర్చ ఇదే" అన్నారు.