అందరికీ తెలిసిన అనుభవాన్ని కళారూపంగా తీర్చి దిద్దడంలో రచయిత పొందిన కృతార్థకత సామాన్యమైనదిగాదు. వర్జీనియా వూల్ఫ్ రాసిన “మిసెస్-లవే” గుర్తువస్తుంది నాకు... భిన్న ప్రవృత్తులు గల వ్యక్తుల చిత్రణను కూర్చడంలో ఒక ఆర్కెస్ట్రాని తయారు చేసిన ప్రతిభ కనబరిచాడు రచయిత. -
- ఆర్.ఎస్. సుదర్శనం
ఓ పాసింజరు బస్సులో ప్రయాణం - అద్భుతంగా దృశ్యీకరించటమే కాదు, మొత్తం ఈ వ్యవహారం వెనకవున్న ఆర్థిక, సాంఘిక, తాత్త్విక నేపథ్యాన్ని ప్రత్యేకించి చెప్పకుండానే కథనంలో ఒదిగిపోయేలా చేయడం ఈ నవల ప్రత్యేకత.
- వి. రాజారామమోహనరావు
నవలలోని వర్ణన మహేంద్ర ప్రత్యేకతను తెలుపుతోంది. శిల్పం అనితర సాధ్యమన్నట్టుగా ఉంటుంది. రాయలసీమలో పేదరికం మీద, కరువుమీద, రైతులసమస్యల మీద తరువాతి కాలంలో వచ్చిన నవల లన్నింటికి ఇది మొదటిది అనే చెప్పవచ్చు... భారతీయ భాషలలో వచ్చిన గొప్ప నవలల స్థాయిలో చేర్చవలసిన నవల...
- వాడ్రేవు వీరలక్ష్మీదేవి