Logili Books

Short Stories

Thova Muchatlu 1st part

By Jayadheer Tirumalarao

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thova Muchatlu 1st part
Publisher
Spuha Sahithi Samsta
ISBN
MANIMN3497
Binding
Paerback
Published Date
First Edition June, 2013
Number Of Pages
206
Language
Telugu
Availability
In Stock
About this book

దారిలోని స్నేహితులకి

ముప్పై ఐదేళ్ళుగా ఎంత తిరిగినా తెలుసుకోవలసింది ఇంకా ఎంతో మిగిలే ఉంది. పర్యాటకం వేరు. అది ఆనందకోసం. పర్యటన వేరు. అది క్షేత్ర అనుభవం. మానవ సంబంధం. ప్రజలతో కలసి పనిచేసేవారు, సమాజ నిర్మాతలైన శ్రమజీవుల చెమట అంటిన కరస్పర్శ. ఇలాంటి ఆనందం పొంది తీరాల్సిందే. అక్కడ నేర్చుకున్న విజ్ఞానమే నిజమైనది. ఆ జీవ మేధావులతో మాట్లాడడమే గొప్ప అనుభవం. వారితో జరిగే ప్రతి ఇంటరాక్షన్ సమాజం గురించి ఎంతో విలువైన సమాచారం ఇచ్చింది. ప్రతిసారి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నేను నేర్చుకున్నది చాలావరకు వారినుండే. నేను నా రాతల్లో కొందరు తమని ప్రశ్నించాననుకొన్నారు. ఆ ప్రశ్నలు నాకు ప్రజలు వేసినవే. ఈ ప్రశ్నలకు సాహిత్యంలో స్థానం కల్పించినందుకు ఒకరిద్దరు ఆగ్రహిస్తారు. దశాబ్దకాలం నుండి ఇప్పటివరకు ప్రశ్నలకు రాత పూర్వకంగా ఎవరూ, ఏ రూపంలోనూ సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు, సంస్థలు స్పందించలేదంటే అవి అసత్యాలు కాదన్నట్లే కదా. అంటే ప్రజల భావాలు సరైనవే. వారి ప్రశ్నలు, భావనలు, వ్యక్తం చేసిన అనుమానాలు గౌరవించదగినవే.

ప్రశ్నలకు జవాబులు చెప్పని వ్యక్తులే రాజకీయ శక్తులకు తప్పుడు సమాచారం పంపి ప్రభావితం చేస్తున్నారు. ప్రశ్నల్ని తలెత్తుకోనివ్వని పరిస్థితులు కల్పించబూనడం ప్రగతిశీల / విప్లవరంగంలో విచారకర ఘట్టం.

కొతపాఠం చదవడం కోసం కొత్తదైన దేశీయ జ్ఞానం తెలుసుకోవడం కోసం | కొత తోవల్లో అడుగుపెట్టడం అనివార్యం. ప్రజల నాడిని, వారి భావాలను విని, 'గౌరవించి, నేర్పుతూ, నేరుస్తూపోవడమే కర్తవ్యం. ఈ సందర్భంలో భిన్నశకుల మధ్య జరగాల్సిన సంభాషణని గుర్తించ నిరాకరించడం వ్యక్తివాద స్వభావం కాక మరేమిటి? ఐనా సరే ఇప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధమే. కాని నగరంలో విపవ సాహిత్య శిబిరాలు అగ్రహారాల స్వభావాన్ని వదిలించుకోవడం లేదు. ఇంకా.......

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?