• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Undu Nayana Disti Tista

Undu Nayana Disti Tista By Jillella Balaji

₹ 150

ముచ్చటగా మూడోసారి...

నమస్కారం. మిమ్మల్ని కలుసుకోవటం ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో నా 'సిక్కెంటిక, వొంతు' కథా సంపుటులు విడుదల సందర్భంగా మిమ్మల్ని పలకరించాను. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని పలకరించే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. ఈసారి రొటీన్ కు కాస్త భిన్నంగా మిమ్మల్ని సంతోషపెట్టాలని ఈ కథల సంపుటికి శ్రీకారం చుట్టాను. కాసేపైనా మిమ్మల్ని మనసారా నవ్వించాలనీ, హాయిగా ఆనందంలో ముంచెత్తాలనీ... నేను రాసిన హాస్య కథలను మీకు అందించాలనుకుంటున్నాను.

ఔను, తెల్లవారి లేచింది మొదలు మళ్లీ పడుకునేంతవరకూ ఎన్నో సమస్యలతో సతమతమైపోయే మనకు కాసిన్ని జోకులు, కూసింత హాస్యమూ ఎంతో ఉత్తేజాన్నిస్తుంది, ఉత్సాహాన్నిస్తుంది. కష్టాలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకునే సందర్భం ప్రతి మనిషి జీవితంలోనూ చాలా అవసరం. కనుక కడుపుబ్బా నవ్వుకునే హాస్యాన్ని మీ ముందు పరచాలనుకుంటున్నాను.

ఒరి హాస్య కథలే కాదండోయ్... హాస్యంతోపాటు మిమ్మల్ని సరసమైన కథలతో గిలిగింతలు పెట్టాలనీ, శృంగార కథలతో పరవశింపచేయాలనీ అనుకుంటున్నాను. ఆ రకంగా మిమ్మల్ని మీరు మరిచిపోయి ఊహా లోకాలలో తేలిపోవాలన్నది నా ఆకాంక్ష. ఇలా నేను భిన్నమైన ఈ రెండు రసాలతో కూడిన కథలను తీసుకురాబో తున్నానని తెలపగానే నా మిత్రులు, శ్రేయోభిలాషులలో కొందరు వద్దని వారించారు, తీసుకురావద్దని అభ్యంతరం తెలిపారు.

వాళ్ల సలహా, అభిమతం ఏమిటంటే... హాస్యం పరవాలేదుకానీ, సరస శృంగార కథలతో కూడిన పుస్తకం తీసుకురావటం వల్ల నాకున్న పేరునూ, సంపాదించిన కీర్తినీ పోగొట్టుకుంటానట! నాకు నవ్వొచ్చింది.

ఒకప్పటిలా పరిమితమైన రచయితలుండి, పాఠకులుండి, పత్రికలుండి... రచయిత రచనలు చేసినప్పుడు... పాఠకులు ఆ రచయితను అభిమానించేవాళ్లు, తలమీద పెట్టుకుని ఊరేగేవాళ్లు. ఆ రచయితే మరో కథను మరో పత్రికలో రాసినపుడు... ఇతను పలానా కథను రాసిన పలానా రచయిత... అని గుర్తుపెట్టుకుని అదే అభిమానాన్ని ప్రదర్శించి... ఆయన్ను గుండెలో గుడికట్టి ఆరాధించేవాళ్లు.

అలా పేరు పొందిన ఎందరో రచయితలు విరివిగా రచనలు చేసి, పాఠకుల్ని మెప్పించి, వాళ్ల అభిమానాన్ని సంపాదించి, కీర్తి ప్రతిష్ఠలు గడించి కాలగమనంలో.....................

  • Title :Undu Nayana Disti Tista
  • Author :Jillella Balaji
  • Publisher :Parvati Viswam Prachuranalu, Tirupati
  • ISBN :MANIMN6124
  • Binding :Papar Back
  • Published Date :June, 2019
  • Number Of Pages :159
  • Language :Telugu
  • Availability :instock