• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vastu Koumudi
₹ 600

  1. వాస్తు పద నిర్వచనము

వాస్తు కౌముది - ప్రథమ భాగము

'వస' - 'నివాసే' అనే ధాతువు నుండి వాస్తు అనే పదం జనించింది. గృహాదినిర్మాణం ద్వారా నివాసయోగ్యమైన భూమి వాస్తువు అని సరళమైన భావము.

అందుచేతనే అమరకోశకారుడు - "వేశ్మ భూర్వాస్తు రస్త్రియామ్" - అని నిర్వచనం చేశాడు. వేశ్మభూ : వాస్తు - అస్త్రియామ్) వేశ్మభూ: దీని అర్ధము గృహాది నిర్మాణ యోగ్యమైన భూమి, వాస్తు వ వాస్తువు అనబడును । ఆస్ట్రియామ్ వ స్త్రీలింగమునందు ఈ పదము ఉండదు. అనగా వాస్తు శబ్దము పుంలింగముగాను, నపుంసకలింగముగాను ఉండును అని పరిశిష్టార్థము. సంస్కృతంలో 'వాస్తు : వాస్తు' - అని రెండు లింగాలు - పుంలింగము నపుంసకలింగము గలదై ఉండును.

తెనుగునందు వాస్తు శబ్దము అమహద్వాచకం అగుటచే పుంలింగ నపుంసకలింగాలకు రూపంలో భేదం లేదు.

ఉదా - తరుః - తరువు - (పుంలింగము) చెట్టు

మధు - మధువు - నపుంసకలింగము (అర్ధము - తేనె)

క్రమంగా ఈ వాస్తు శబ్దార్థం బహుధా విస్తృతిని పొందింది. ఇచ్చట పాఠకులు ఈ విషయాన్ని గుర్తింపదగును.

భాషా శాస్త్రాన్ని బట్టి పరిశీలించినచో క్రమంగా భాషలోని కొన్ని శబ్దాల యొక్క అర్థం విస్తరించుటయు అనగా వ్యాపకం అగుటయును, అలాగే కొన్ని శబ్దాలయొక్క అర్థము సంకుచితం అనగా పరిమితం అగుటయు అనుభవ సిద్ధము.

ఉదా - వీణావాదనము అనేది మిక్కిలి నేర్పుతో గూడినది మధురకంఠస్వరయుతమైన సంగీతవైదుష్యంతో బాటు వీణావాదన నైపుణ్యం సైతం ఉన్నచో అట్టివారు అపరసరస్వతీ ప్రతిబింబాలే అగుదురు. ఇలా వీణా నైపుణ్యంగలవారినే మొదట ప్రవీణులు అన్నారు - అనగా - 'ప్రవీణ' బిరుదంతో సత్కరించారు. ఇట్టివారు మనకు పౌరాణికంగా నల్గురే ప్రసిద్ధులు. వారి (వీణలును లోక విశ్రుతిని పొందినాయి..............

  • Title :Vastu Koumudi
  • Author :Swargiya Jeereddy Balachenna Reddy
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN3886
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock