• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vennela Konalu

Vennela Konalu By Allam Rajaiah

₹ 320

సాహిత్య విమర్శకుడిగా అల్లం రాజయ్య

మనందరికీ కథా, నవలా రచయితగా తెలిసిన అల్లం రాజయ్య సాహిత్య విమర్శకుడు కూడా. ఆ సంగతిని ఈ పుస్తకం రుజువు చేయనక్కర్లేదు. ఆయన కథా రచనతో పాటే విమర్శా రచన కూడా మొదలుపెట్టారు. 1979 జనవరి వరంగల్ విరసం సాహిత్య పాఠశాలలో 'కథ, నవల, జీవితం'పై రాజయ్య ఒక ప్రసంగం చేశారు. ఆ తర్వాత దాన్ని విరసం ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది.

ఆ ప్రసంగంలో ఆయన విప్లవోద్యమంతో ఆరంభమైన కొత్త కల్పనా సాహిత్య 'లక్ష్య, లక్షణాలను వివరించారు. అప్పటికే ఆయన కొన్ని కథలు రాశారు. కొలిమంటుకున్నది నవల సీరియల్ మొదలైంది. వాటిలో విప్లవ కథకు, నవలకు ప్రమాణాలు రూపొందుతున్నాయి. అంతక ముందు భూషణం, ఎన్నెస్ ప్రకాశరావు, బీటీ రామానుజం వంటి సుప్రసిద్ధ విప్లవ రచయితలు కథలు రాశారు. విప్లవ కథకు ఒక తీరును అందించారు. కానీ కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాట సన్నివేశం నుంచి రూపొందుతున్న విప్లవ కథా నిర్మాణంలో భాగస్వామిగా రాజయ్య ఆ ప్రసంగం చేశారు. విప్లవ కథ నేల పొరల నుంచి ఎలా ఎదిగి రాగలదో అందులో ఆయన వివరించారు. ఆ రకంగా ఆయన విప్లవ విమర్శ ప్రారంభించారు.

ఇప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకంలో ఆయన రాసిన ముందుమాటల సంపుటం. ఇందులో తన కథలకు, నవలలకు రాసిన ముందుమాటలు ఉన్నాయి. వెనక మాటలు ఉన్నాయి. ఇతరులు పుస్తకాలకు రాసినవి ఉన్నాయి. ఎక్కువ ఇవే.

వీటిలో పాటలు, కవిత్వం, సామాజిక వ్యాసాలు, క్షేత్ర పర్యటన విశ్లేషణ రచనలకు రాసిన ముందుమాటలు కూడా ఉన్నాయి. అవి కొన్నే. మిగతావన్నీ కథలు, నవలలకు రాసిన ముందుమాటలే. ఆయన సృజనాత్మక వ్యక్తిత్వంలో కథ, నవల ప్రధానం. ఆయన వ్యక్తీకరణకు వచన ప్రక్రియలు అనుకూలం. ఆ కాలానికి, ఆ ఉద్యమానికీ ఉన్న ప్రత్యేకత ఇది.

దేశీయమైన పాట, దృశ్య కళా రూపాలకు, 'ఆధునిక' కథ, నవలా........................

  • Title :Vennela Konalu
  • Author :Allam Rajaiah
  • Publisher :Viplava Rachayithala Sangham
  • ISBN :MANIMN6324
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :449
  • Language :Telugu
  • Availability :instock