• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vijayaniki Daridi

Vijayaniki Daridi By Dr C Verender

₹ 200

పోటీ పరీక్షలకు సిద్ధం కావడమెలా ?

జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి ఉద్యోగాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు వాటిని చాలా కష్టమైనవిగా భావిస్తారు. ఏ పరీక్షలకైనా కావాల్సింది వాటి పట్ల స్పష్టత ఉండటం. సమయ పాలన కూడా ముఖ్యమే. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం.

పోటీ పరీక్షలకు కావలసిన నైపుణ్యాలను నేర్చుకొని సంసిద్ధం కావాలి. అనవసరం ఒత్తిళ్ళ వలన పరీక్షకు సరిగ్గా సిద్ధం కాలేరు. స్పష్టమైన లక్ష్యాల వలన విజయం సాధ్యమవుతుంది. సమస్యల సాధన, ఎంత వేగంగా ఖచ్చితమైన సమాచారం రాబట్టడం నేర్చుకున్న అంశాలపై ఎంత పట్టుందో తెలుసుకోవడమే పోటీపరీక్షల ఉద్దేశం.

వీటిలో విద్యార్థులు అన్ని అంశాల్లో తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూ సిద్ధం కావాలి. బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఇక్కడా ఫలితం అలాగే ఉంటుందనుకోవడం పొరపాటు. గతాన్ని మరచి 'పోటీ'కి కావలసిన నైపుణ్యాలను నేర్చుకుని సంసిద్ధం కావాలి.

ముఖ్యమైన అంశాలు

ఏ పోటీ పరీక్ష కోసం చదువుతున్నామో అనే స్పష్టత ముఖ్యము. తల్లిదండ్రులు రకరకాల పరీక్షలు రాయాలని ఒత్తిడి తేవచ్చు. అయితే మీరు ఏ పరీక్ష సమర్థవంతంగా రాయగలరో నిర్ణయించుకుని, ఆ విషయాన్ని వారికి ఖచ్చితంగా చెప్పాలి. అనవసర ఒత్తిళ్ల వల్ల ఎవరైనా ఏ పరీక్షకూ సరిగ్గా ప్రిపేర్ కాలేరు. స్పష్టమైన లక్ష్యాల వల్లే విజయం సాధ్యమవుతుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం.

పోటీ పరీక్షల సిలబస్ దాదాపు ఒకటే అయినా, పరీక్షించే పద్ధతులు వేరు. ఇది గమనించి రాయబోయే పరీక్ష నమూనాలోనే ప్రిపరేషన్ను కొనసాగించాలి. ఇది మిగతావి రాయడానికి కొంత వరకు ఉపయోగపడుతుంది కానీ, ఒకేసారి అన్ని పరీక్షల ప్రిపరేషన్తో గందరగోళం సృష్టించుకోవద్దు...........................

  • Title :Vijayaniki Daridi
  • Author :Dr C Verender
  • Publisher :Life Syllabus Publicaitons
  • ISBN :MANIMN6495
  • Binding :Papar back
  • Published Date :Sep, 2022 3rd print
  • Number Of Pages :159
  • Language :Telugu
  • Availability :instock