Logili Books

Novels

Sandya Ragam

By Karri Gangu Naidu

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sandya Ragam
Publisher
Vishalandra Publishing Housing
ISBN
MANIMN7075
Binding
Paparback
Published Date
Jan, 2026
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

సంధ్యారాగం

ఓరోజు సాయంత్రం దిగులుగా కూర్చుని వుంటాడు రాజారాం. ఆ ఊరి అంతటికి పలుకుబడి, డబ్బున్నవాడు అతను. చాలా మంచివాడు కూడా. అతని భార్యపేరు తులసి. ఏడు సంవత్సరాలు అవుతున్నా వారికి పిల్లలు లేరు. పిల్లలకోసం ఎన్నో వ్రతాలు, పూజలు చేశారు. అయినా ఫలితం లేదు. కానీ పిల్లలమీద మమకారం వారికిపోలేదు. అందుకే ఎవరు ఏ గుడి గురించి చెప్పినా అక్కడికి వెళతారు. ఇంకా గుళ్ళు చుట్టూ తిరిగే ఓపిక లేక దిగులుగా కూర్చున్నాడు రాజారాం. పిల్లలకోసం బాధపడుతున్న అతని దగ్గరకు రామశాస్త్రి అనే పంతులు వచ్చాడు. ఏదో వ్రతం గురించి అతను చెబుతుంటే వద్దు శాస్త్రిగారు ఇంకా మాకు దేవుడిపైన నమ్మకం లేదు, కలిగించవద్దు. నాకు తెలిసి నేను కానీ, నా భార్యకానీ ఎవరికీ అన్యాయం చేయలేదు. అటువంటిది మాకెందుకీ శిక్ష అన్నాడు. అలా అనకండి రాజారాం గారు. దశరథ మహారాజు వ్రతం చేసే రామ లక్ష్మణ భరత శతృఘ్నులను కన్నారు. ద్రుపద మహారాజు యాగం చేసి ద్రౌపదిని కూతురుగా పొందారు అని చెబుతుండగా శాస్త్రిగారు పురాణాలు వినే ఓపిక నాలో చచ్చిపోయింది అన్నాడు. అంతెందుకండి రఘురాంగారు మీకు తెలుసుకదా అని అడిగాడు శాస్త్రి. అవును అన్నట్లు తలూపాడు రాజారాం. అతనికి పిల్లలు లేకపోతే రామాలయం పునర్నిర్మిస్తానని మొక్కుకున్నాడు. అతనికి ఇప్పుడు రెండేళ్ళ కొడుకు అని చెప్పగానే నిజమా అని అన్నాడు. రాజారాం. నిజమేనండి. ఆయన రేపు రామాలయం కోసం భూమి పూజ చేయిస్తున్నారు. ఆ విషయం చెప్పి అక్కడికి మిమ్మల్ని పిలవడానికి నేను వచ్చాను అని చెప్పాడు శాస్త్రి.

శాస్త్రిగారు చెప్పిన మాటలు విన్న రాజారాంలో ఆశలు మొలకెత్తాయి. వెంటనే నేను ఒకసారి రఘురాంని కలవాలి పదండి అని రఘురాం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఇంట్లో రఘురాం, అతని భార్య జానకి ఉన్నారు. లోపలికి రమ్మని పిలిచి కూర్చోమన్నాడు. రఘురాం. అతను భూమిపూజ పనుల్లో బిజీగా ఉన్నాడు. అతని భార్య వెళ్ళి అందరికీ కాఫీలు తెచ్చిపెట్టింది. ఏమిటండి ఇలా వచ్చారు అని అడిగాడు రఘురాం. మరేంలేదు.....................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?