• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Katha 2021
₹ 140

కల్లోల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయా?

వాసిరెడ్డి నవీన్

కథారచనకు స్వేచ్ఛావ్యవస్థ తప్పనిసరి.

ఆమాటకొస్తే ఏ రచనకైనా అది అవసరమే. ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీన పడుతోంది. అంటే రచయితలకు స్వేచ్ఛ లేదని కాదు. (అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వేరు.) కానీ కనపడని ఇనుపతెరలు దానికి అడ్డుగా వేలాడుతున్నాయి. రచయిత తన అభిప్రాయాలను, భావావేశాలను, దృక్పథాన్ని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తెలివిడిని తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తపన పడతాడు. రచనకున్న ఈ ప్రాథమిక ఉద్దేశానికి ఆటంకాలు ఏర్పడుతున్న దశ ఇది. మరీ ముఖ్యంగా సృజనాత్మక రచనలకు.

కథలకు కానికాలం వచ్చేసింది.

ఇటీవల కాలంలో కథల నిడివి రానురాను కుంచించుకుపోతోంది. ఎంచు కున్న కథావస్తువుకు అవసరమనిపించినంత, రాయవలసిన అవసరం ఉండి, రాయగలిగి కూడా రచయిత రాయలేకపోవడం విషాదం కదా! పత్రికల్లో సాహిత్యానికి జాగా తగ్గిపోవడము, కథలను ప్రచురించే పత్రికలు కనుమరుగైపోవడము, తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా.............

  • Title :Katha 2021
  • Author :Vasireddy Naveen , Papineni Shiva Shankar
  • Publisher :Katha Sahiti
  • ISBN :MANIMN3884
  • Binding :Paerback
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :218
  • Language :Telugu
  • Availability :instock